Karthika Deepam2 : దాస్ ని చూసి జ్యోత్స్న షాక్.. తన ఎంగేజ్ మెంట్ ఆపగలదా!
on Jul 18, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -412 లో... జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. మంచి ఛాన్స్ మిస్ చేసావ్ గ్రానీ.. ఎందుకు ఎంగేజ్ మెంట్ ఆగిపోతుందన్నప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కదా అప్పుడే గౌతమ్ మంచివాడు కాదని చెప్పుండాల్సింది.. నేను గౌతమ్ మంచివాడు కాదని చెప్పే ఛాన్స్ లేదు.. ఇప్పుడు అలా చెప్తే దీప మంచిది అవుతుందని జ్యోత్స్న అంటుంది. ఎలాగైనా ఈ ఎంగేజ్ మెంట్ ఆపాలని జ్యోత్స్న అంటుంది.
మరొకవైపు దీప, కార్తీక్ ఇద్దరు కలిసి జ్యోత్స్న ఏం ప్లాన్ చేస్తుందని డిస్కషన్ చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం పారిజాతం జ్యోత్స్న దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది. ఎంగేజ్ మెంట్ దగ్గరికి వచ్చిన కొద్ది ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. నువ్వు ఎందుకే టెన్షన్ పడడం... కాశీ ఎంగేజ్ మెంట్ ఆపేస్తాడు కదా అనీ పారిజాతం అంటుంది. ఆ తర్వాత పారిజాతం లోపలకి వెళ్ళాక జ్యోత్స్న దగ్గరికి దాస్ వచ్చి.. రా జ్యోత్స్న వెళదామని అంటాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను శివన్నారాయణ గారికి ఒక నిజం చెప్పాలని లోపలికి వెళ్తుంటే వద్దు నాన్న అనీ జ్యోత్స్న అంటుంది. అయిన వినకుండా లోపలకి వెళ్తాడు. అందరు ఉంటారు. అప్పుడే శివన్నారాయణ వచ్చి ఎందుకు వచ్చావని అడుగుతాడు శివన్నారాయణని లోపలికి గదిలోకి తీసుకొని వెళ్లి దేవుడి మాల ఇస్తాడు. మీరు ప్రమాదంలో ఉన్నారు ప్లీజ్ కాదనకండి అని దాస్ చెప్పగానే శివన్నారాయణ మెడలో వేసుకుంటాడు. దాస్, శివన్నారాయణ బయటకు వచ్చేవరకు ఎక్కడ నిజం చెప్పేస్తున్నాడోనని పారిజాతం, జ్యోత్స్న టెన్షన్ పడుతారు.
కానీ బయటకు వచ్చి శివన్నారాయణ జరిగింది చెప్పగానే జ్యోత్స్న కూల్ అవుతుంది. నిన్ను ఎవరో కొట్టారో గుర్తు వచ్చిందా అని సుమిత్ర అడుగుతుంది. నన్ను ఎవరు కొట్టారని మళ్ళీ గతం గుర్తు లేనట్టు యాక్టింగ్ చేస్తుంటాడు దాస్. మరొకవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటుంటే కాంచన వస్తుంది. మళ్ళీ ఈ ఎంగేజ్ మెంట్ ఆపడానికి మీరేం చెయ్యట్లేదు కదా అని అనగానే.. లేదు, మా వాళ్ళు తట్టుకోలేరు మీ అందరిలో ఎవరు బాధపడ్డా నేను చూడలేనని కాంచన బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
